Start now →

Trading Scam:

By Bigtv Telugu · Published June 5, 2026 · 1 min read · Source: Trading Tag
TradingSecurity

Trading Scam:

Bigtv TeluguBigtv Telugu1 min read·1 hour ago

--

ట్రేడింగ్ పేరుతో రూ.25 కోట్ల మోసం? అనంతపురంలో కలకలం

స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయలు సేకరించిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి, అనంతపురంలో ఆరిజన్ సొల్యూషన్స్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి పలువురిని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అధిక వడ్డీలతో నమ్మకం

మొదట బంధువులు, స్నేహితుల నుంచి చిన్న మొత్తాల్లో పెట్టుబడులు తీసుకున్న నరేష్ రెడ్డి, వాటిపై ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చి నమ్మకం సంపాదించాడు. అనంతరం మరింత అధిక లాభాలు వస్తాయని చెబుతూ పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు సేకరించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విధంగా దాదాపు 120 మంది నుంచి సుమారు రూ.25 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం.

డబ్బులు ఆగిపోవడంతో అనుమానాలు

కొంతకాలం వరకు లాభాలు చెల్లించినప్పటికీ, తర్వాత చెల్లింపులు నిలిచిపోయాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బుల గురించి ప్రశ్నించగా నష్టాల్లో ఉన్నానని, త్వరలో మొత్తం తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. అనంతరం నరేష్ రెడ్డి అందుబాటులో లేకుండా పోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.

ఉద్యోగులకూ నష్టం

సంస్థలో పనిచేసిన సుమారు 50 మంది ఉద్యోగులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. వారికి కూడా అధిక లాభాల ఆశ చూపి డబ్బులు పెట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసులకు ఫిర్యాదు

ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. నిధుల సేకరణ, పెట్టుబడుల వినియోగం, ఆర్థిక లావాదేవీలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

పెట్టుబడిదారులకు హెచ్చరిక

స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎప్పుడూ రిస్క్‌తో కూడుకున్నవే. అసాధారణంగా అధిక లాభాలు హామీ ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు సంస్థ విశ్వసనీయత, చట్టబద్ధత, ఆర్థిక వివరాలను పూర్తిగా పరిశీలించడం అవసరం.

This article was originally published on Trading Tag and is republished here under RSS syndication for informational purposes. All rights and intellectual property remain with the original author. If you are the author and wish to have this article removed, please contact us at [email protected].

NexaPay — Accept Card Payments, Receive Crypto

No KYC · Instant Settlement · Visa, Mastercard, Apple Pay, Google Pay

Get Started →